Maha Kumbha mela: మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో భారీగా భక్తుల రద్దీ..! 1 y ago
మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో ఆఖరి రోజైన బుధవారం భక్తులు చివరి అమృత స్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమానికి భారీగా తరలివచ్చారు. వేలాది మంది భక్తులు పవిత్ర గంగాజలంలో స్నానం చేస్తూ భక్తిభావంతో మునిగితేలారు. ఈ ప్రత్యేక ఘట్టానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు మహా కుంభమేళాలో 63 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానం చేసినట్లు అంచనా.